మంచి గురువుని లైఫ్ లో ఎలా ఎంచుకోవాలి…?

-

చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా రావు. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు నష్టాలు ఉండవు ఆచార్య చాణక్య మన జీవితంలో ఎదురయ్యే చాలా సంఘటనల గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు పాటిస్తే జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో గురువులు తప్పక ఉండాలి. గురువు లేకపోతే మనం మంచిదారి పట్టలేము గురువు లేకపోతే మనం ఉన్నత స్థాయికి వెళ్లలేము.

Chanakya Niti

గురువు చాలా విషయాలని మనకి నేర్పిస్తారు మంచి గురువు ఉంటే జీవితంలో మనం ఎంతో ఎత్తుకు వెళ్ళగలం. అయితే గురువుని ఎంచుకునేటప్పుడు ఈ లక్షణాల గురువులు ఉండేటట్టు చూసుకోవాలి. ఒక వ్యక్తి తన సొంత జీవితం లో క్రమశిక్షణతో ఉంటేనే ఇతరులకి కూడా క్రమశిక్షణని తీసుకు రాగలరు కనుక క్రమశిక్షణ ఉన్న గురువుని ఎంచుకోవాలి సద్గుణాలతో నిండిన గురువు ఉంటే మనం కూడా మంచి నేర్చుకోగలము.

దురాశ అసూయ వ్యామోహం అహంకారం వంటి దుర్గుణాలు సద్గుణాలు ఉన్న వ్యక్తిలో ఉండవు అలానే నైతికత అనుసరించే వ్యక్తి మాత్రమే సద్గురువు అవుతారు. అలాంటి గురువు తన శిష్యులకి ధర్మంతో పాటు భక్తిని కూడా చూపుతారు ఇటువంటివి గురువు దగ్గర నుండి శిష్యుడు నేర్చుకుని ఆదర్శ పౌరులుగా మారాలి. అసూయ గురువుకి ఉండకూడదు అదేవిధంగా శిష్యుడు ఎదుగుదల తను ఎదుగుదలగా భావించాలి గురువు. ఇలాంటి లక్షణాలు ఉన్న గురువు కనుక మన జీవితంలోకి వచ్చారంటే మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలం.

Read more RELATED
Recommended to you

Latest news