అమరావతి రైతులకు చెల్లించాల్సిన కౌలు ఆలస్యంపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్నటువంటి హైకోర్టు సీఆర్డీఏ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇక అమరావతి రైతులకు చెల్లించాల్సిన కౌలు జాప్యంపై రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలను విన్నది హైకోర్టు.
రైతుల తరుపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. రైతులకు కౌలు చెల్లించేందుకు జీవో ఇచ్చి.. ఆపై ప్రభుత్వం కౌలు చెల్లించేందుకు జీవో ఇచ్చి.. ఆపై ప్రభుత్వం కౌలు చెల్లించలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతీ ఏడాది మే 31లోపు కౌలు చెల్లించేవారని కానీ ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయవాది మురళీధరరావు వాదనలు హై కోర్టు రికార్డు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీఆర్డీఏకి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.