High tension again in Tadipatri: తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ రెండో రోజు విచారణ కొనసాగుతోంది. నిన్న క్షేత్రస్థాయిలో రాళ్లు రువ్వుకుని, హింస జరిగిన ప్రాంతాలలో పరిశీలించింది సిట్ బృందం.

తాడిపత్రి పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. తాడిపత్రిలో జరిగిన ఆల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 7 కేసులు నమోదు అయ్యాయి. 91 మంది అరెస్ట్ అయ్యారు. తాడిపత్రి అల్లర్లకు, హింసకు సంబంధించి మధ్యాహ్నం కల్లా సిట్ నివేదిక రెడీ అయ్యే అవకాశం ఉంది. ఈ తరునంలోనే… తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది.