అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్‌నకు జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ మద్దతు

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ తరఫును ట్రంప్ మరోసారి బరిలోకి దిగారు. ఇప్పటికే ప్రచారాన్ని ఆయన ముమ్మరం చేసి అమెరికన్ ఓటర్ల మనసు గెలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో అగ్రరాజ్యంలోనే  అతిశక్తిమంతమైన సంస్థగా పేరున్న జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏ) మద్దతు రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు లభించింది.

2024 ఎన్నికల నేపథ్యంలో ఆయన టెక్సాస్‌లో వేల మంది ఎన్‌ఆర్‌ఏ సభ్యులను ఉద్దేశించి శనివారం ప్రసంగించారు. అంతకు కొద్ది సేపటి ముందే ఆ సంస్థ ట్రంప్‌నకు మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఓటు వేసి వచ్చే నాలుగేళ్లలో వారి తుపాకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టం పౌరులకు ఇచ్చిన ఆయుధాలను లాక్కోనేందుకు బైడెన్‌ గత 40 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని .. రాజ్యాంగంలోని రెండో సవరణను సంరక్షిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news