పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి టీడీపీ కార్యకర్తల యత్నం..!

-

అనంతపురం జిల్లా తాడిపత్రి లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే ఈరోజు సాయంత్రం తాడిపత్రి లోని తన ఇంటికి వచ్చారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. అది తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించడానికి అక్కడికి వచ్చారు.

అయితే తన ఇంట్లో కీలక డాక్యుమెంట్లు ఉండడంతో.. వాటిని తీసుకెళ్లడానికే తాడిపత్రికి వచ్చారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి . కానీ అనుకోకుండా టీడీపీ కార్యకర్తలు తన ఇంటి వద్దకు చేరుకోవడంతో.. తాడిపత్రి నుంచి తిరిగి వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. అనంతరం తాడిపత్రిలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి DSP జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసారు పోలీసులు. అనంతరం పెద్దారెడ్డి అనుచరుడు వైసీపీ నాయకుడు కందిగోపుల మురళి ప్రసాద్ రెడ్డి నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసారు. రెండు కార్లు ,స్కూటర్ ధ్వంసం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news