పుంగనూర్ లో హై టెన్షన్.. పోలీస్ శాఖ సంచలన నిర్ణయం..!

-

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అల్లర్ల నేపథ్యంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు పుంగనూరులో 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ఎవ్వరూ పుంగనూరుకు రావద్దని హెచ్చరించారు. ఎలాంటి సభలు, సమావేశాలు కూడా నిర్వహించవద్దని.. ఎవ్వరైనా నిబంధనలు అతిక్రమిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవలే ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్బంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులలో పలువురికి గాయాలు అయ్యాయి. పలు చోట్ల ప్రభుత్వ ఆస్తులు సైతం ధ్వంసం అయ్యాయి. ఎంపీ మిథున్ రెడ్డి కారుతో పాటు మాజీ ఎంపీ రెడ్డప్ప కారు సైతం ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఈ అల్లర్ల నేపథ్యంలో రెండు పార్టీల నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మారోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పుంగనూరులో 144 సెక్షన్ కొనసాగిస్తూ.. పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news