శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. కన్నడ భక్తుడిపై హోటల్ యజమాని దాడి

-

కర్నూలు జిల్లా లో ని శ్రీశైలం పుణ్యక్షేత్రం లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ వీధుల్లో కన్నడ భక్తులు రెచ్చిపోయారు. టీ షాపు దగ్గర మొదలైన చిన్న వివాదం ఘర్షణకు కారణమైంది. స్థానికంగా ఉన్న సత్రం పరిధిలోని టి షాపు దగ్గర నీళ్ల విషయంలో గొడవ మొదలైంది. ఈ గొడవ లో స్థానికులకు, కన్నడ వ్యక్తులతో మాటామాటా పెరిగి దాడి చేసుకునే వరకు వెళ్ళింది.

స్థానికుడు కర్ణాటక వాసిని గొడ్డలితో నరికాడు. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో కర్ణాటక వాసులు దాడికి దిగారు. శ్రీశైలంలోని తాత్కాలిక దుకాణాలను ధ్వంసం చేశారు. ఆలయ పరిసరాల్లో, ఈఓ ఆఫీస్ కు వెళ్లే మార్గంలో ఫుట్ పాత్ లపై ఉన్న షాపులు ధ్వంసం చేస్తూ తగులబెట్టారు అల్లరి మూకలు. ఇక ఈ ఘర్షణను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

ఈ వివాదంపై శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి శ్రీ చెన్నసిద్దరమా శివచర్య స్వామిజీ మాట్లాడుతూ.. శ్రీశైలంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ పెద్దగా మారింది…ఇద్దరి భాషలు వేరు…. అందుకే ఇంత తప్పు జరిగిందన్నారు. కర్ణాటకలో మల్లికార్జున స్వామి భక్తులు చాలా మంది ఉన్నారని.. కర్ణాటక భక్తులకు శ్రీశైలంలో ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. ఇటువంటి సమయంలో ఇరు రాష్ట్రాల వారు కలసిమెలసి ఉండాలి.. ఇద్దరు వ్యక్తుల గొడవను ఇరురాష్ట్రల గొడవగా తీసుకురావద్దని వెల్లడించారు. భక్తులందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news