తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి పాలకమండలి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే వయోవృద్ధులు అలాగే వికలాంగుల దర్శనాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రతి రోజూ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు ప్రకటన చేసింది టిటిడి పాలకమండలి.
శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం పదిగంటలకు, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు అలాగే వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించింది టిటిడి పాలకమండలి. కరోనా కారణంగా వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.
కాగా నిన్న తిరుమల శ్రీవారిని 61244 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 33930 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండి ఆదాయం 4.02 కోట్లు దాటింది. ఇక ఇవాళ నుంచి కరెంట్ బుకింగ్ విధానంలో ఆర్జిత సేవలను జారి చెయ్యనుంది టిటిడి. అలాగే తిరుపతిలో ఎల్లుండికి సర్వదర్శన టోకేన్లు జారీ చేయనుంది టిటిడి.