AP Assembly: నేడు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల

-

AP Assembly: నేడు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనుంది చంద్రబాబు సర్కార్‌. గత 5ఏళ్ల పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతల పై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు హోమ్ మంత్రి వంగలపూడి అనిత. అలాగే, ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు సంతాపం ప్రకటించనుంది శాసనసభ.

Home Minister Vangalapudi Anitha will release a white paper on the law and order which has gone out of control during the last 5 years of rule

శాసన సభలో ప్రశ్నోత్తరాలు కూడా ఉంటాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ , ప్రత్యేక అవసరాల విద్యార్థుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, సంఘ విద్రోహశక్తుల నియంత్రణ, విశాఖపట్టణం లో ని ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలో సౌకర్యాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడుల పై ప్రశ్నలు-మంత్రుల సమాధానాలు ఉంటాయి. అలాగే, ఎస్సి ఎస్టీ ల సంక్షేమ పధకాల రద్దు, రాష్ట్రం లో టిడ్కో గృహాలు, సుప్రీం కోర్టులో కేసులు ,ఆళ్లగడ్డ నియోజకవర్గం లో కె సి కెనాల్ మల్లింపు, బదిలీచేయదగిన అభివృద్ధి హక్కులు పై ప్రశ్నలు – మంత్రులు సమాధానం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news