దసరా పండుగకు ముందే సామాన్యులకు బిగ్ షాక్. పండుగ వేళ ప్రతి ఒక్కరూ నిత్యవసర సరుకులు తెచ్చుకోవాలనుకునే సమయంలో మార్కెట్లో సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు షాక్ అవుతున్నారు. ఇప్పటికే నూనె ధరలు లీటరుపై రూ. 20 నుంచి రూ. 40 రూపాయల వరకు పెరిగాయి. అల్లం ధర విపరీతంగా పెరిగిపోయింది.
కిలో రూ. 100 నుంచి రూ. 150 రూపాయలు, వెల్లుల్లి రూ. 300 నుంచి రూ. 360, కందిపప్పు కిలో రూ. 150 నుంచి రూ. 175, ఎండుమిర్చి రూ. 200 నుంచి 240, పెసరపప్పు రూ. 30 నుంచి రూ. 150, ఉల్లి ధరలు కిలోకి రూ. 60 రూపాయలకు తగ్గడం లేదు. మినప్పప్పు రూ. 135కు చేరింది. అంతేకాకుండా కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కిలోపై రూ. 20 నుంచి రూ. 30 రూపాయల వరకు పెరిగాయి. దీంతో సామాన్యులు ఏది కొనుక్కొని తినలేని పరిస్థితుల్లో పడుతున్నారు.