రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ అలాగే తెలంగాణలో భారీగా చికెన్ విక్రయాలు తగ్గాయి. బర్డ్ ప్లూ భయంతో చికెన్ కొనేవారు లేరు తినేవారు లేరు. ఆదివారం అయినప్పటికీ చికెన్ మార్కెట్ వెలవెలబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ అలాగే తెలంగాణలో చికెన్ మార్కెట్ పై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడింది. దీంతో… చికెన్ ధర తగ్గిపోయింది.
ప్రస్తుతం చాలా మార్కెట్లలో చికెన్ ధర కేజీ 180 రూపాయలుగా ఉంది. గత 15 రోజులుగా పరిశీలిస్తే 220 నుండి ప్రస్తుతం 150 రూపాయలకు ధర పడిపోయింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్ కు వచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో….రెండు తెలుగు రాష్ట్రా లైన ఏపీ అలాగే తెలంగాణలో మటన్ కు డిమాండ్ పెరిగింది. ఎక్కువ మంది మటన్ తింటున్నారు. దీంతో.. కిలో మటన్ రూ.900 అమ్ముతున్నారు. దీంతో మాంసాహరులు లబోదిబోమంటున్నారు.