తిరుమల శ్రీవారి ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది. నవంబర్ మాసంలో తిరుమల శ్రీవారిని 19.73 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టిటిడి అధికారికంగా ప్రకటించింది. ఇక నెల రోజుల లెక్కల ప్రకారం హుండి ద్వారా 108 కోట్లు ఆదాయంగా నమోదు అయింది.
97.47 లక్షల లడ్డు ప్రసాదాల విక్రయాలు జరిగాయి. 36.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. 7 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టిటిడి అధికారికంగా ప్రకటించింది.
కాగా, తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే తిరుమలలో 5 కంపార్టుమెంట్లలో వేచివున్నారు తిరుమల శ్రీవారి భక్తులు.
అటు టోకేన్ లేని తిరుమల శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి నిన్న ఒక్క రోజే 4 గంటల సమయం పడుతోంది. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 58, 278 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 17, 220 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు.నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం రూ.3.53 కోట్లుగా నమోదు అయింది.