సింహంతో వేట – జగనన్నతో ఆట వద్దు: మంత్రి రోజా

-

శుక్రవారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఏపీ మంత్రి రోజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్( ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీలకు ఇది చెప్పుదెబ్బ లాంటిది అన్నారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తేనే చంద్రబాబును ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడారని, కానీ తమ ప్రభుత్వంలో వరుసగా రెండు సార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంకింగ్ రావడంతో జగనన్నను ఎలా పొగడాలో కొంతమందికి అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానీ హైదరాబాద్ ఇంట్లో కూర్చోవాలని రోజా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు హయాంలో కేవలం ప్రచార ఆర్భాటమే తప్పితే జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. సింహంతో వేట.. జగనన్నతో ఆట వద్దు అంటూ బాలయ్య డైలాగులు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల బాక్సులు బద్దలవడం ఖాయం అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version