గుంటూరు మహిళ ప్రాణాలు కాపాడిన హైదరాబాద్ ఉద్యోగి..!

-

అరుదైన రక్తం అవసరం వచ్చినప్పుడు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఎవరు ముందుకు వచ్చి ఇస్తారో తెలియదు. ఎవరిని అడగాలో తెలియదు. ఇలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. తాజాగా ఒక దాత ఒక గర్భిణి ప్రాణం కాపాడారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, చేకూరుకు చెందిన కిరణ్‌, కృష్ణలతది వ్యవసాయ కుటుంబం.

ఆమె నిండు గర్భిణి… కాన్పు సమయం దగ్గర పడటంతో గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్ళగా ఆమెకు పరిక్షలు చేసిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని చెప్పడ౦తో షాక్ అయ్యారు. అయితే ఆమెది చాలా అరుదైన రక్తం. బాంబే ఫెనోటైప్‌ రక్తం. రక్తం ఎక్కిస్తేనే ఈ నెల 23న సర్జరీ చేస్తామని వైద్యులు స్పష్టంగా చెప్పారు. దానికి తోడు లాక్ డౌన్ ఉంది. ఎక్కడ అడిగినా సరే ఆ రక్తం మాత్రం అందుబాటులో లేదు.

ఆమె భర్త, బంధువులు రెండు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా కష్టాలు పడుతున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజునాయుడు వారికి ఒక సలహా ఇవ్వడంతో ఆన్లైన్ లో రక్తం ఇచ్చే వారి కోసం వెతికారు. ఉప్పల్‌లోని బీరప్పగడ్డలో ఉండే ప్రైవేటు ఉద్యోగి గౌతమ్‌కుమార్‌ శనివారం అందుబాటులోకి వచ్చి ఆమెకు రక్తం ఇచ్చారు. సోమవారం కిరణ్‌ ఓ వాహనానికి అనుమతి తీసుకుని హైదరాబాద్‌ వచ్చి… ఆయన వద్ద రక్తం సేకరించారు. ఫలితంగా ఆమెకు రక్తం దొరికింది.

Read more RELATED
Recommended to you

Latest news