ఓఆర్ఆర్ టోల్ చార్జీలను నేటి నుంచి 5 శాతం పెంచుతున్నట్లు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్టు ,సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు ఈ మేరకు తెలిపింది.
ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్ హెచ్ఐఏను ఎన్నికల సంఘం ఆదేశించింది. కారు, జీపు, వ్యాన్‌లకు ప్రతి కిలోమీటర్‌కి రూ.2.34 పైసలు, ఎల్‌సివి, మినీ బస్‌లకు రూ.3.77, బస్, 2–యాగ్జిల్ ట్రక్‌లకు రూ.6.69, భారీ నిర్మాణ మెషినరీ, ఎర్త్ మూ వింగ్ ఎక్విప్‌మెంట్‌లకు రూ.12.40, ఓవర్‌సైజ్డ్ వాహనాలకు రూ.15.09 చొప్పున టోల్ చార్జీలు పెరగనున్నాయి.