ఆడబిడ్డల జోలికొస్తే వదిలిపెట్టం అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కందుకూరులో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ లో భాగంగా సీఎం పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో బాలికపై కత్తితో పొడిచి ఆసిడ్ దాడి చేశారు. ఆ అమ్మాయి చావు బతుకుల్లో ఉంది. ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటుంది. గంజాయి డ్రగ్స్ పై కట్నం గా వ్యవహరిస్తాం. సంపద సృష్టించడమేమో లక్ష్యం. గత ఐదు సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు సంపద సృష్టించబడలేదు. కోట్లాది రూపాయల అప్పులు చేశారు. అసలు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మొన్ననే అప్పులు చెల్లించలేదని నోటీసులు పంపించారు. మళ్లీ అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అప్పు గట్టడం వల్ల సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని తెలిపారు. ప్రజలందరూ పరిశుభ్రతకు పాదాన్ని తీయాలి మనం తినే తిండి పీల్చే గాలి కలుషితం అవుతుంది. సమాజం కోసం అందరూ బాధ్యతతో పని చేయాలనీ సూచించారు చంద్రబాబు. కలుషిత ఆహారంతో పలు రోగాల బారిన పడుతున్నామని పేర్కొన్నారు.