ఏపీలో కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ధర్మవరంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేతల మధ్య దూరం పెరిగిందనేది దుష్ప్రచారమేనని చెప్పారు. ముందుగా అనుకున్న ప్రకారమే ఉపముఖ్యమంత్రి పవన్ దక్షిణ భారత ఆలయాల సందర్శనకు వెళ్లారని తెలిపారు. కేబినెట్ మీటింగ్కు వెళ్లనంత మాత్రాన విభేదాలున్నాయని ప్రచారం చేయడం సరికాదని సూచించారు.
తామంతా కలిసే పనిచేస్తున్నామని, కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రంలో జీబీఎస్ వ్యాధిపై మాట్లాడుతూ.. దానిపై ఎలాంటి ఆందోళన చెంచడాల్సిన పనిలేదన్నారు. ఇప్పటి వరకు కేవలం 7 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. మరణాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామన్నారు. త్వరలో వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. బర్దూపై ప్రచారాలు నమ్మవద్దని.. ఎక్కడా మనుషులకు సంక్రమించలేదని తెలిపారు