జగన్ ఇలాగే ఉంటే 175 సీట్లు మావే.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

-

జగన్ ఇలాగే ఉంటే 175 సీట్లు మావే అని ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ కి ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని.. లేదంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని పేర్కొన్నారు. జగన్ సమావేశాలకు వెళ్లకుంటే ఆయనతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని ఇటీవలే షర్మిల పేర్కొన్నారు. అసలు షర్మిలకు ఎంత విసుగు వచ్చి ఉంటే ఆ మాట మాట్లాడి ఉంటారో ఆలోచించాలన్నారు.

అసెంబ్లీకి రాకుండా అధ్యక్ష అనకుండా ఎమ్మెల్యేగా ఉండి దేనికి అని ప్రశ్నించారు. పులివెందుల ఎమ్మెల్యేగా నెగ్గిన తరువాత కూడా అసెంబ్లీకి రావాలంటే జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని.. లేదంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఆయన రాకపోవడమే కాదు.. మిగతా ఎమ్మెల్యేలను కూడా రానివ్వడని చెప్పారు. కొద్ది రోజులు అయితే అసెంబ్లీకి వెల్లని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి వేస్ట్ అని ప్రజలే అనుకుంటున్నారని.. కొనసాగితే రేపటి రోజు 175 కి 175 సీట్లు ప్రజలు ఎన్డీఏకి ఇవ్వడంలో తప్పు ఏమి లేదని అనిత వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news