సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇతర మతాలను గౌరవించేది కేవలం సనాతన ధర్మమే అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో ప్రసంగించారు పవన్ కళ్యాణ్. ఏడు కొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా..? ఓట్ల కోసమే మాట్లాడతామా..? నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. నాకు అన్యాయం జరిగితే బయటికి రాలేదు. తిరుమలలో అపచారం జరుగుతోంది. సరిదిద్దండి అని గతంలో చెప్పాను. పట్టించుకోలేదు.
11 సీట్లకే పరిమితమయ్యారు. ధర్మాన్ని మనం రక్షిస్తే.. ధర్మమే మనల్ని రక్షిస్తుంది. కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం శ్రీ వేంకటేశ్వరస్వామి అన్నారు పవన్ కళ్యాణ్. ఇతర మతాలను చూసి నేర్చుకోవాలి. సనాతన ధర్మానికి కొన్ని దశాబ్దాలుగా అవమానం జరుగుతూనే ఉంది. మనం గౌరవం ఇవ్వడం లేదు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే వచ్చాను. డిప్యూటీ సీఎంగా, జనసేనత అధినేత ఇక్కడికి రాలేదు. హిందువుగా.. భారతీయుడిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు పవన్ కళ్యాణ్.