టూరిజం డెవలప్ కావాలంటే శాంతి భద్రతలే కీలకం అన్నారు సీఎం చంద్రబాబు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. శాంతి భద్రతలు రాష్ట్రానికి చాలా కీలకం అన్నారు. కొంత మంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత పై కూడా అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు. భవిష్యత్ లో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే.. ఏం చేయాలో అది చేసి చూపిస్తామన్నారు. శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ లోని పీడీ యాక్ట్ లను అనుసరిస్తామని తెలిపారు.
ముఖ్యంగా రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దాని వెనుక గంజాయి బ్యాచ్ ఉంటుందన్నారు. నేరస్తుల గుండెల్లో రైల్లు పరిగెత్తేలా కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. షర్మిల పై వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులను నా నోటితో నేను చెప్పలేను. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. ఇక ఎవరైనా భూమిని ఆక్రమిస్తే.. ఆరునెలల్లోనే శిక్ష పడేలా చేస్తామని.. వాళ్లు ఇక బయట తిరగలేరని హెచ్చరించారు సీఎం చంద్రబాబు.