తాను ఒకటి తలిస్తే..దైవం మరొకటి తలిచింది అని..గ్రామస్తులు ఒక దేవుడికి గుడి కట్టిద్దామని అనుకుంటే, మరో దేవుడి రూపాలు బయట పడటంతో జనాలు ఆందోళనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వీరబ్రహ్మం గారి మఠం కట్టేందుకు పునాదులు తవ్వుతుంటే.. శివలింగాలు భయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆలుమూరు గ్రామంలో పురాతన కాలం నుంచి అవదూత వీర బ్రహ్మం స్వామి వారికి మఠం ఉంది.ఇక్కడ భక్తులు పూజలు కూడా చేసేవారు. నమ్మిన భక్తుల కోర్కెలు తీరుస్తారని గ్రామస్తుల నమ్మకం కూడా. ఎప్పుడో పాత కాలంలో కట్టిన మఠం కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఆదే ప్రాంతంలో మఠం నిర్మించాలని గ్రామస్తులు తీర్మానించారు..
ఆలయ నిర్మాణానికి పనులు మొదలు పెట్టారు…అందులో భాగంగా భూమిని తవ్వుతుంటే శివలింగాలు బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 11 శివలింగాలు ప్రత్యక్షమయ్యాయి..స్వామి వారి తలభాగంలోనే కనిపించాయి. వీటిని చూసేందుకు చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. బ్రహ్మంగారి మఠం కట్టాలని పూనుకుంటే.. శివలింగాలు భయటపడటంతో గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. కొందరు మఠం నిర్మాణం చేపట్టాలని కోరుతుంటే, కొంత మంది శివాలయాన్ని కట్టాలని డిమాండ్ చేస్తున్నారు.