IIT experts coming to Amaravati today: అమరావతిపై మరో ముందడుగు పడింది. ఇక ఇవాళ అమరావతికి ఐఐటీ నిపుణులు వస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యాన్ని అధ్యయనం చేయనున్నారు ఇంజినీర్లు. రెండు రోజుల పాటు రాజధానిలో కట్టడాల పరిశీలన చేయనున్నారు నిపుణులు. 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే పనులు నిలిచిపోయిన భవనాలను పరిశీలించనుంది ఐఐటీ బృందం.
ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయిన పనులని స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు నిపుణులు. ఈ భవనల ఫౌండేషన్ సామద్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్ కు అప్పగించింది ప్రభుత్వం. ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది సర్కార్. ఇక ఇవాళ అమరావతికి ఐఐటీ నిపుణులు వస్తున్నారు.