ఏపీలో మీచౌoగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. అయితే.. ఈ మీచౌoగ్ తుఫాను ప్రభావంతో వర్షం కారణంగా పలు విమానాలు రద్దు అయ్యాయి. వాతావరణం అనుకూలించక ఆకాశంలోనే చక్కర్లు కొట్టి ల్యాండ్ కానీ ఇండిగో,స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా విమానాలు అనంతరం స్పైస్ జెట్ విమానం బెంగళూరుకు వెళ్ళింది.
ఇండిగో,ఎయిర్ ఇండియా విమానాలు హైదరాబాదుకు పయనమయ్యాయి. ఇకమీదట రావాల్సిన విమానాలన్ని కూడా వాతావరణం అనుకూలించక పోవడం వలన విమానాలన్నీ రద్దు అయ్యాయి. రేణిగుంట విమానాశ్రయం నుండి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు చేసేది లేక వెనుదిరిగారు. ముఖ్య ప్రయాణికులకు విమానాశ్రయ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
కాగా,మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదుల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. స్వర్ణముఖి నదిలోకి భారీగా వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాకాడులో స్వర్ణముఖి బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.