ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామా మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య ప్రతకం గ్రామం మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.
Village-Secretariats
సచివాలయ, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పనిచేసే ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమలుకు చర్యలు తీసుకున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు… ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ మాసం నాటికి అందరికీ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కార్డులు అందజేస్తామని ప్రకటించారు. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.