జాగ్రత్త జగన్… నమ్మకం కోల్పోవద్దు… అక్కడ పడ్డావంటే లేవడం కష్టం!

-

వైకాపా అధినేత, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారంటే అందులో ఆయన కష్టం, కార్యకర్తల కష్టం, నాయకులతోడు ఇవన్నీ, ప్రజల నమ్మకం ఇవ్వన్నీ కారణాలు. ఇదే క్రమంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యారంటే అందులో మరో అత్యంత ప్రధానమైన, కీలకమైన కారణం… ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓటు బ్యాంకు… కాదనలేని సత్యం! ఈ క్రమంలో టీడీపీ బీసీలను టార్గెట్ చేసింది… ఫలితం రాలేదు! దాంతో ఇప్పుడు ఎస్సీలను వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తుంది!! ఆ వర్గం దగ్గర జగన్ పై ఉన్న నమ్మకం పడిపోయిందంటే మాత్రం లేవడం కష్టం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ap cm jagan mohan reddy

వివరాళ్లోకి వెళ్తే… 2019ఎన్నికల్లో టీడీపీని అత్యంత దెబ్బకొట్టినవారిలో ఎస్సీ, బీసీ, మైనారిటీల పాత్ర ఎక్కువ అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ విషయంలో మరి ముఖ్యంగా ఎస్సీలు జగన్ ను పూర్తిగా ఓన్ చేసుకున్నారనే చెప్పాలి! దాంతో ఆయా వర్గాలను జగన్ కు దూరం చేసే చర్యల్లో భాగంగా గతకొన్ని రోజులుగా బీసీ కార్డు ఎత్తుకుంది టీడీపీ. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అల అరెస్టులు.. అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణపై కేసులతో… బీసీలకు న్యాయం చేసేది ఎప్పటికైనా టీడీపీనే… బీసీలను అణగదొక్కే చర్యల్లో భాగంగానే వీరిపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం జరిగిందని ఆరోపించింది. జగన్ అదృష్టం ఏమిటంటే… ఈ బీసీ కార్డు అనేది బాబు చెప్పిన లాజిక్కులకు అప్లై కాలేదు! అక్కడితో ఆ వ్యూహం చితికిపోయింది!

దాంతో ఇప్పుడు ఎస్సిలపై టార్గెట్ పెట్టింది టీడీపీ & ఆ పార్టీ అనుకూల మీడియా! డాక్టర్ సుధాకర్ అరెస్టో, అంబెద్కర్ విగ్రహం మార్పో అనేది.. టీడీపీ మాటలను ఎస్సీలు నమ్మేలా చేయడానికి సరిపోవు! కాబట్టి… ప్రస్తుతం ఎస్సీలకు జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న తెరవెనుక అన్యాయం ఇదంటూ కథనాలు ఇవ్వడం మొదలైంది! అందుకు వారు ఎంచుకున్నవి టీడీపీ హయాంలోని… అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్, విద్యోన్నతి పథకాలతో పాటు ఎస్సీకార్పొరేషన్ కు కేటాయించిన నిధులు!!

విదేశాల్లో ప్రముఖ వర్సిటీల్లో సీట్లు పొందిన ఎస్సీ యువతకు మొదట రూ.15లక్షల ఆర్థిక సాయం అందించేదిశగా టీడీపీ ప్రభుత్వం “అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌” పథకాన్ని తెచ్చింది. ఇదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు సివిల్స్ ‌కు అవసరమైన శిక్షణ కూడా “విద్యోన్నతి” పథకం ద్వారా అందించింది. ఎంతమందికి అందించింది అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. పథకాలైతే ఉన్నాయి!! ఈ క్రమంలో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ పథకాలు తీసేశారనేది టీడీపీ ఆరోపణ! ఈ పథకాల పేర్లు మార్తమే మార్చారా లేక మరో రూపంలో ఈ అవసరాలు తీర్చే పనికి ప్రభుత్వం వద్ద ఇప్పటికే ప్రణాళికలు ఉన్నాయా అనే విషయాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

ఇదే క్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ అనేది కూడా చాలా కీలక భూమిక పోషించే విషయం. ఈ విషయంలో ఇప్పటివరకూ ఏ రకమైన లోన్ లు ఇవ్వలేదని… ఒక్క పైసా కూడా కేటాయించకుండా వదిలేసిందని ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో జగన్ సర్కార్ అత్యంత అప్రమత్తమయ్యి… రెగ్యులర్ గా లోన్స్ ఇవ్వడం.. ఈ కార్పొరేషన్ కు నిధులు కేటాయించడం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది! అలాకానిపక్షంలో ఆ వర్గం విషయంలో జగన్ నమ్మకం పడిపోతే మాత్రం లేవడం కష్టం అనేది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది!!

Read more RELATED
Recommended to you

Latest news