ఏపీ విద్యార్థులకు షాక్‌..పీజీ వైద్య విద్య ఫీజులు పెంపు !

-

ఏపీ విద్యార్థులకు షాక్‌ తగిలింది. పీజీ వైద్య విద్య ఫీజులను ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 2023-24 విద్యా సంవత్సరానికి 2022-23లో ఉన్న వార్షిక ఫీజులపై 15% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ స్పెషాలిటీ కోర్సులో… పిజి సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ‘ట్యూషన్’ ఫీజు కింద రూ.17,25,000 తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

ఈ పెంపు ఐదు ప్రైవేట్ కళాశాలలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.  రేషన్ కార్డులు ఉన్నవారికి సెప్టెంబర్ నుంచి ఫార్టీఫైడ్ బియ్యాన్ని పిడిఎస్, ఎండిఎం, ఐసిడిఎస్ ల ద్వారా పంపిణీ చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. పలు జిల్లాల్లో ఇప్పటికే అమలవుతుండగా… మిగతా జిల్లాలకు సెప్టెంబర్ నుంచి విస్తరిస్తామన్నారు. ఫార్టీఫైడ్ బియ్యం రక్తహీనతను నిరోధిస్తుందని, దీనితో దీనిలో బి12 విటమిన్ తో నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news