రేణూ దేశాయ్ ట్వీట్ కి అంబటి రిప్లై.. మాజీ కి చెప్పండమ్మా అంటూ..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన జీవితంలో పవన్ కళ్యాణ్ చేసింది 100% తప్పు అని, అయితే రాజకీయపరంగా తాను ప్రజలకు మంచే చేస్తున్నాడు కాబట్టి జనసేన పార్టీకి తాను పూర్తీ మద్దతుగా నిలుస్తాను అని ప్రజల కోసం పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ చెబుతూనే మరొకపక్క తన పిల్లలను రాజకీయ రొంపులోకి లాగవద్దు..అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఆ ట్వీట్ కి అంబటి రాంబాబు రిప్లై ఇచ్చారు.

ఇక ఈ నేపథ్యంలోనే పవన్ మాజీ భార్య వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ..” అమ్మా రేణూ .. మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందవద్దని” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇకపోతే పవన్ నటించిన తాజా సినిమా బ్రో.. ఈ సినిమా లో పృధ్విరాజ్ పోషించిన శ్యాంబాబు అనే పాత్రను తనను ఉద్దేశించే పెట్టారు అంటూ గత కొద్ది రోజులుగా అంబటి రాంబాబు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇలా సినిమాలలో తన క్యారెక్టర్ ను క్రియేట్ చేసి పవన్ సంబరపడుతున్నాడు అంటూ మంత్రి చెబుతున్నారు.

ఈ క్రమంలోనే తాము కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సినిమాలు తీస్తామంటూ వైసీపీ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా వీడియోని రిలీజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై సినిమా, వెబ్ సిరీస్ చేస్తామంటూ చాలామంది ఆయన పెళ్లిళ్లు, పిల్లలు, భార్యల గురించి ఈ సినిమాలు ఉంటాయని అంటున్నారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి నా పిల్లలను లాగకండి ..నా పిల్లల్ని కాదు ఏ పిల్లల్ని, ఆడవాళ్ళని కూడా పాలిటిక్స్ లోకి లాగవద్దు. ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి అంటూ తెలిపింది. ఇక దీంతో ఈమె చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news