ఏపీలో నేడు పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ స్పెషల్‌ డ్రైవ్

-

నేడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో “ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ (ఐఈఐడీ)” డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి జూలై 5వ తేదీ వరకూ 20 రోజుల పాటు పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టనున్నారు.

cm jagan

ఇందులో భాగం గానే… పారిశ్రామిక పార్కుల్లో తుప్పలను తొలగించడం, పేర్లను సూచించే బోర్డుల ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాల ఏర్పాటు, వరద కాల్వల నిర్వహణ, రహదారుల మరమ్మతులు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనుంది ఏపీఐఐసీ. హిందూపురంలోని అమ్మవారి పల్లిలో మొక్కలు నాటి ‘ఐఈఐడీ’ని ప్రారంభించనున్నారు ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి. గుంటూరు జిల్లా ఆటోనగర్ లో పారిశుద్ధ్య పనులలో భాగస్వామ్యమవనున్నారు ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది. ఇక ఈ మహోత్తరమైన కార్యక్రమంలో… స్థానిక నేతలు, పారిశ్రామిక వేత్తలు పాల్పంచుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version