ఏపీలో అక్టోబర్ 16న సీఎం జగన్ చేతులు మీదుగా ఇన్ఫోసిస్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. విశాఖ నగరం కార్య నిర్వాహక రాజధానిగా స్వాగతిస్తూ అభినందన సభ నిన్న జరిగింది. జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ అభివృద్ధిపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు.
ఇక ఈ సందర్భంగా ఏపీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ…. అక్టోబర్ 16న సీఎం చేతులు మీదుగా ఇన్ఫోసిస్ ప్రారంభం కానుందని.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 9వ నగరంగా విశాఖ వివిధ రాష్ట్రాల రాజధానులతో పోటీ పడుతోందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్ ను నిర్ధేశించే శక్తి విశాఖకు ఉందని వివరించారు ఏపీ మంత్రి అమర్నాథ్. గత పాలకులు అమరావతిని రాజధానిగా ప్రకటించారు కనుక జగన్మోహన్ రెడ్డి వైజాగ్ కు మారుస్తున్నారనేది దుష్ప్రచారం మాత్రమేనన్నారు. కాంట్రాక్టర్లు అంటే ప్రభుత్వంలో భాగం అందరి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు ఏపీ మంత్రి అమర్నాథ్.