కొత్త జిల్లాలపై హై కోర్టు ట్విస్ట్‌.. జగన్‌ సర్కార్‌ కు కీలక ఆదేశాలు

-

అమరావతి : కొత్త జిల్లాల ఏర్పాటు పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్ర‌దేశ్ లో నూత‌నంగా ఏర్పాటు కాబోతున్న జిల్లాలను ఉగాది ప‌ర్వ‌దినం నుంచే ప్రారంభించాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నేపథ్యంలో.. ఏపీ హై కోర్టు.. కొత్త జిల్లాల ఏర్పాటు పై బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చింది. ఏపీ లోని కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారంపై హైకోర్టు లో ఇవాళ విచారణ జరిగింది. జిల్లాల ఏర్పాటు పై కౌంటర్ దాఖలు చేయాలని జగన్‌ మోహన్‌ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది హై కోర్టు.

ఈ వ్యవహారంలో తుది ప్రకటన వెలువడకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరింది. తాము ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది హై కోర్టు. ఇక ఈ కేసు తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. ఈ లెక్కన ఉగాదికి ఏపీలో కొత్త ఏర్పాటు కల గానే మిగిలేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news