విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం

-

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం రానుంది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియంలో 50 వేలకుపైగా సీటింగ్‌ సామర్థ్యం ఉండే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. త్వరలో ఈ ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం శంకుస్థాపన కూడా ఉంటుందన్నారు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి. విశాఖ, విజయవాడ, కడపలో ఏపీఎల్‌ సీజన్‌–3 కూడా ప్రారంభం కానుంది.

Integrated Cricket Stadium in Visakhapatnam

ఈ తరుణంలోనే.. మార్చిలో విశాఖలో ఏపీఎల్‌ మ్యాచ్‌లు కూడా ఉంటాయన్నారు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి. ప్రతి జిల్లాలో ఏసీఏ మైదానం, జోన్‌కు ఒక స్టేడియం నిర్మాణం ఉంటుందని ప్రకటించారు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి. ప్రతిభ గల యువ క్రికెటర్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో వరల్డ్‌క్లాస్‌ శిక్షణ ఉంటుందని… త్వరలోనే 175 నియోజకవర్గాల్లో మెగా స్కూల్‌ క్రికెట్‌ లీగ్‌ ఉందన్నారు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news