ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షల ఫీజు గడువును రేపటి వరకు పొడిగిస్తూ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రెగ్యులర్ ఫీజు రూ. 550, అపరాధ రుసుము రూ.3,000ను రేపు సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ లో చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.
విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనుండగా…. మార్చి 1 నుంచి 15 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
కాగా, ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును అటు తెలంగాణ ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈనెల 29వ తేదీ లోపు రూ. 4000 ఆలస్య రుసుముతో కలిపి ఫీజులు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శనివారం ఉత్తర్వులను జారీచేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు తేదీని పెంచుతున్నామని తెలిపింది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.