రాయల సీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా నాలుగు సంవత్సరాల పరిపాలన అంతా శాశ్వతమైన మార్పు తీసుకురావాలని అడుగులు వేయడం జరిగింది. కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాజాగా హంద్రీనీవా ప్రాజెక్ట్ ను ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల హంద్రీవానీవా ప్రధాన లంకసాగరం వద్ద పంపు హౌస్ ఏర్పాటు చేసి హంద్రీనీవా నీటితో 77 చెరువులను నింపబోతున్నామని తెలిపారు సీఎంజగన్. పక్కనే శ్రీశైలం ఉన్నా కూడా ఒక్క ఎకరా ఇరిగేషన్ లో లేనిపరిస్థితి. ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నా కూడా గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు మేలు జరుగుతుందని తెలిపారు. రాయల సీమ నీటి కష్టాలు ఏంటో నాకు తెలుసు. కరువు జిల్లాలను గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. రాయలసీమ బిడ్డగా నీటి విలువ తెలిసిన మీ బిడ్డగా రూ.253 కోట్లతో యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టడంజరిగిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. 8 మండలాలకు 10,130 ఎకరాలకు సాగునీరు అందిస్తూ.. గ్రామాలన్నింటికి త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు.