పై ఫొటోలను చూశారుగా! దీని గురించి చెప్పే ముందు.. అసలేం జరుగుతోందో చూద్దాం.. ప్రస్తుతం కరో నా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇంటికే పరిమిత మయ్యారు. ఇక్కడి పనులు అక్కడే ని లిచి పోయాయి. పరిశ్రమలు కూడా ముందుకు సాగడం లేదు. దీంతో పేదలకు ఏదైనా సాయం చేయాల నే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా స్పందిస్తున్నారు. పారిశ్రా మిక వేత్తలు కూడా స్పందించి కోట్లకు కోట్లు విరాళాలుగా ఇస్తున్నారు. అదేసమయంలో వివిధ రూపాల్లో ప్రజలకు సాయం చేస్తున్నారు.
ఇలాంటి సాయం చేస్తున్నవారు ఎంత భారీగా చేసినా.. పెద్దగా చెప్పుకోవడం లేదు. ఏదో గుప్తంగా ఇచ్చి.. పక్కకు తప్పుకొంటున్నారు. ఇక, ఇప్పుడు పై ఫొటో దగ్గరకు వద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పేదలకు టీడీపీ నేతలు పంచిన లాక్‌డౌన్ సాయం. ఒక్కొక్క కుటుంబానికి రెం డు కిలోల బియ్యం. అరకిలో టమాటాలు, కొద్దిగా మిర్చి. నాలుగు మునక్కాడలు ఇలా పంచారు. దీనిని ఎవ రూ తప్పుబట్టరు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేశారని సరిపెట్టుకోవ చ్చు. కానీ, ఇక్కడ జరిగింది.. పంపిణీ ముసుగులో ఫక్తు ప్రచారం అనే వాదన బాహాటంగా వినిపిస్తోంది.
టీడీపీ నేతల్లోనే ఓ వర్గం.. మా వోళ్లు పావలా ఇచ్చి. ముప్పావలా ప్రచారం చేసుకున్నారని గుసగుసలాడు తు న్నారు. సాయం ఇచ్చేప్పుడు మూడో కంటికి తెలియాల్సిన అవసరంలేదు. ఇక, చేసిన సాయం స్వల్ప మైనప్పుడు చెప్పుకోవడం కూడా దండగే. కానీ, కుప్పంలో మాత్రం పావలా సాయం చేసి.. ముప్పావలా ప్రచారం చేసుకున్నారని అంటున్నారు. పేదలతో ఎన్టీఆర్ ట్రస్టు ప్లకార్డులు పట్టించి.. ఓ రెండు కిలోల బియ్యాన్ని వారి చేతుల్లో పెట్టారు. దీంతో ఏం చేసినా.. ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబుపై సోషల్ మీడియాలోనూ సటైర్లు పేలుతున్నాయి. పావలా సాయం.. ముప్పావలా ప్రచారమా?.. అంటూ ట్రోల్స్ నడుస్తుండడం గమనార్హం.