విశాఖ గ్యాస్ దుర్ఘటన… కంపెనీ చేసిన అతిపెద్ద తప్పు ఇదేనా…?

-

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖలో జరిగిన గ్యాస్ దుర్ఘటన విషయంలో ఇప్పుడు తప్పు కంపెనీదే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కంపెనీ చేసిన తప్పు కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అసలు ఒక అంచనా లేకుండా కంపెనీ ని ఆవేశ పడి తెరిచారు అని అంటున్నారు. ఫ్యాక్టరీ40 రోజులు షట్ డౌన్ చేసిన తర్వాత తిరిగి ఓపెన్ చేసేటప్పుడు పైప్ లైన్స్ అన్ని చెక్ చేసుకుని సర్వీసింగ్ చేసుకోవాలని వాళ్లకు తెలియదా…?

లాక్ డౌన్ అయిన కంపెనీ తెరిస్తే ముందు ప్రభుత్వ అధికారి అయిన ఇండస్ట్రీ ఇన్స్పెక్టర్ చెకింగ్ అయిన తర్వాత మాత్రమే రన్ చేయాల్సి ఉంది. కానీ అలాంటి ఇన్స్పెక్షన్ ఏమీ జరగలేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. వాతావరణంలో టెంపరేచర్ పెరగటం వలన దాని ప్రభావం గ్యాస్ ట్యాంకర్ల పై పడుతుందని అంటున్నారు. కాబట్టి వాటి దగ్గర నిర్ణీత టెంపరేచర్ ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

అందుకోసం ముందే కంపెనీ దరఖాస్తు చేసుకుంది అంటున్నారు. ముఖ్యమైన స్టాప్ ని అనుమతి ఇవ్వండి అని పర్మిషన్ కోసం దరఖాస్తు చేసిన అధికారులు ఒప్పుకోలేదని యాజమాన్యం చెబుతోంది. ఏది ఏమైనా, దీనిలో ఎవరి నిర్లక్ష్యం ఉన్నా , చివరికి బలైపోయింది మాత్రం చుట్టుపక్కల ప్రజలే అనేది అర్ధమవుతుంది. పచ్చని చెట్లు మాడి మసి అయిపోయాయి అని గాలి పూర్తిగా కలుషితం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news