నష్టాల్లో ఉన్న ఆదానీకి 60 ఎకరాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం !

నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జెఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు 250 ఎకరాలని లీజు ప్రాతిపాదికన కేటాయిస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

విశాఖపట్నంలో ఆదాని సంస్థ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్, ఐటి, బిజినెస్ పార్క్, స్కిల్, రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటుకు 60.29 ఎకరాల భూమిని వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ కు కేటాయించింది. అలాగే, ఈ నెల 24వ తేదీన ఏపీ రైతుల ఖాతాల్లో ఇన్ పుట్‌ సబ్సీడీ వేయాలని నిర్నయం తీసుకుంది జగన్‌ కేబీనేట్. అటు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద కొత్తగా ఎనర్జీ పార్కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి తో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి తో ఎన్టీపిసి ప్రాజెక్టు కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్‌ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?