BREAKING: అచ్యుతాపురం బాధిత కుటుంబాలకు జగన్ భారీ ఆర్థిక సాయం అందించేందుకు నిర్నయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అచ్యుతాపురం ప్రమాద మృతులకు అండగా నిలవనుంది వైసీపీ పార్టీ. ఇందులో భాగంగానే వైసీపీ పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట జగన్ మోహన్ రెడ్డి.
ఇక ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బొత్స ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం పంపిణీ జరుగనుందని సమాచారం. కొద్ది సేపటి క్రితమే ఈ నిర్ణయం తీసుకుందట వైసీపీ అధిష్ఠానం. దీంతో వైసీపీ పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట జగన్ మోహన్ రెడ్డి. ఇక దీనిపై కాసేపట్లోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.