జగన్ వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని చూస్తున్నారు.. ఎమ్మెల్యే నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు

-

ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. ఎన్నికల సమయంలో అన్ని స్థానాల్లో గెలుపు మాదే అని ధీమాతో ఉన్న వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. అసలు ఓటమి గల కారణం ఏంటి అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీపై బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత పాలనను ప్రజలు ఆమోదించరనే విషయం కూటమి గెలుపుతో మరోసారి స్పష్టమైందని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించి, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. పద్దెనిమిది స్థానాలు గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ వైసీపీకి అవి కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో దిక్కులేని పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు.  బెంగళూరులో జగన్  డీకే శివకుమార్ తో భేటీ అయ్యారని చెప్పారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధమని చెప్పారని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news