అమరావతి: రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతలు, అడ్డగోలు బిల్లుల మూతలతో జగన్ రికార్డులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు టిడిపి పోలీసు బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు. లోడ్ రిలీఫ్ పేరుతో ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. జల విద్యుత్ కేంద్రాల నిర్వహణకు నాలుగేళ్లుగా నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేని గ్రామం గానీ, నగరం గానీ లేదన్నారు.
స్విచ్ వేయకుండానే ప్రజలకు కరెంట్ షాక్ లు కొడుతున్నాయని మండిపడ్డారు. గజదొంగలు సైతం విస్తుపోయేలా ప్రజలను జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు కళా వెంకట్రావు. జగన్ ఈ నాలుగేళ్లలోనే 8 సార్లు ఛార్జీలు పెంచి రూ.57 వేల కోట్లకు పైగా ప్రజలపై భారం మోపారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు 4 రెట్లు పెరిగాయని.. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయకుండా.. వినియోగదారుల నుండి కనీస వినియోగ ఛార్జీ ఏ విధంగా వసూల్ చేస్తారు.? అని ప్రశ్నించారు.