రూ.3,000 కోట్ల అప్పు చేసిన జగన్ సర్కార్ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.3,000 కోట్ల అప్పు తెచ్చింది. నిన్న RBI నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని సమీకరించింది. దీంతో ఏప్రిల్ నెలలో అధికారికంగా రూ.6000 కోట్ల అప్పు తెచ్చినట్లు అయింది. ఈ రూ.6000 కోట్ల అప్పుతో పాటు, కేంద్రం నుంచి పన్నుల్లో వాటాగా రూ.3,000 కోట్లు వచ్చాయి. ఇవి గాక రాష్ట్ర ఖజానాకు రోజువారి వచ్చే పన్ను ఆదాయం సగటున రోజుకు రూ. 400 కోట్ల చొప్పున వస్తుంది.

కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లకు ఈ నెల 29 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజు విద్యార్థులు, తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించి రిపోర్టు కార్డులను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరయ్యేలా అధికారులు, స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించింది. జూన్ 12 నుంచి ఏపీలో తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version