బీజేపీ అండతో… టీడీపీ నేతలు రెచ్చిపోయి దోపిడి చేస్తున్నారని ఆగ్రహించారు జగన్. ఇసుకపై చాలా ప్రచారం చేశారని….ఒకవైపు ఇసుక ఉచితం అంటారు.. రేట్లు చూస్తే దారుణం అంటూ ఆగ్రహించారు. ఇప్పుడు లారీ ఇసుక రూ. 65వేల పైనే ఉందని… ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. గతంలో ఏడాదికి రూ. 750 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని తెలిపారు.
ఈ 5 నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం సున్నా అంటూ జగన్ పేర్కొన్నారు. రూ.10 వేలు జీతమని చెప్పి వాలంటీర్లను మోసం చేశారని ఆగ్రహించారు. పిల్లలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ప్రజల ఆశలతో చెలగాటమాడుతూ తప్పుడు ప్రచారాలు అంటూ ఫైర్ అయ్యారు జగన్. చంద్రబాబు పాలనలో డీపీటీ మాత్రమే కనిపిస్తోంది…చంద్రబాబు పాలన దోచుకో పంచుకో తినుకో అనట్టు ఉందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మాదిరి డీబీటీ కనిపించలేదని తెలిపారు జగన్. బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులు మింగేసి మళ్ళీ సాక్షి పై కేసులా..? అంటూ ఆగ్రహించారు.