ప్రధానికి ఏపీ సిఎం జగన్ లేఖ

-

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాసారు. పోలవరానికి సంబంధించి ఏడు పేజీల లేఖను ఆయన రాసారు. ప్రధానితో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులకు కూడా ఆయన లేఖ రాశారు. ఇరిగేషన్, భూసేకరణ, పునరావాసానికి నిధులు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. పోలవరం నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

Jagan and Modi

ఈ లేఖలోనే 2014 ఏప్రిల్ 29 కేబినేట్ తీర్మానాన్ని ఆయన ప్రస్తావించారు. పోలవరం ఏపీకి జీవనాడి లాంటిదన్న ఆయన ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు. నిధుల విడుదల జాప్యం, పనులు ఆలస్యంతో అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని జగన్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం 20 వేల కోట్లు మాత్రమే ఇస్తామని, భూసేకరణ తమ పరిధిలోకి రాదని ప్రకటన చేసిన క్రమంలో ఈ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news