కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. తాజాగా వంశీతో ములాఖత్ కావడానికి మాజీ సీఎం జగన్ జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందో బస్తు నిర్వహించారు. కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ.
మరోవైపు జగన్ విజయవాడ జిల్లా కోర్టుకు వస్తున్నారనే విషయం తెలుసుకొని అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే అక్కడికి కేవలం కొద్ది మాత్రమే అనుమతించారు. మరోవైపు రాజకీయ విభేదాలతోనే తనను లక్ష్యంగా చేసుకొని ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో పోలీసులు ముందుకు వెళ్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని వంశీ. అయితే వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్టీ, ఎస్టీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా పోలీసులు నోటీసులు కూడా పంపించారు. జైలులో వంశీని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.