కేసీఆర్ అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారు.. నువ్వేం కట్టావ్ – జగన్

-

ఏపీ మాజీ వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ గారు 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో రూ.616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారన్నారు. చంద్రబాబు నాయుడు 53 లక్షల స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి ? ఎందుకు అంత భూమి ? అన్నారు వైఎస్ జగన్. అమరావతి పనుల కోసం 2018లో టెండర్లు పిలిచామన్నారు జగన్.

JAGAN
JAGAN ON KCR OVER CHANDRABABU

ఆనాడు ఖరారైన టెండర్ల విలువ రూ.41,170 కోట్లు చేసినట్లు వెల్లడించారు. చంద్రబాబు పూర్తి చేసిన పనులు మినహా రూ.35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉందని తెలిపారు. కానీ, ఆ టెండర్లను రద్దు చేశారన్నారు. మిగిలిన ఆ పనుల అంచనాలు అమాంతం పెంచేసి దోపిడీ చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news