ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలా లోతట్టు ప్రాంతాల వారిని అందరినీ పునరావాస కేంద్రాలకి తరలించారు అధికారులు. ఇక ఏపీలో వర్షాలు, వరదలు మీద వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం అయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 చొప్పున ఇవ్వమని ఆదేశించారు.
వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురి కావొద్దని, వెంటనే అన్ని చోట్ల విద్యుత్ సరఫరాను పునరుద్దరించండని ఆయన కలెక్టర్ లని ఆదేశించారు. చెరువులు, కాల్వల గండ్లు పూడ్చాలని జగన్ పేర్కొన్నారు. అలానే రోడ్లపై గుంతలు పూడ్చి, అవసరమైన మరమ్మతులు చేయండని ఆదేశించారు. సహాయ చర్యలు మరింత ముమ్మరం చేయాలన్న ఆయన వరద తగ్గుతోంది కాబట్టి అంటు వ్యాధులు ప్రబలకుండా చూడండని కోరారు. శానిటేషన్ సరిగా ఉండాలని, పరిశుభ్రమైన తాగు నీరు వారందరికీ అందించాలని ఆదేశించారు.