ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి… వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ దేశ రాజధాని.. ఢిల్లీలో మహా ధర్నాకు.. పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నాలో వైసిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతలు… పాల్గొనబోతున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా… ఈ ధర్నాకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

గడిచిన 50 రోజుల్లో 36 హత్యలు ఏపీలో జరిగాయి.1000 కి పైగా దాడలు జరిగిన నేపథ్యంలో… కూటమి ప్రభుత్వం మారడం హోమం సాగిస్తోందని… జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేత రషీద్ హత్య కేసు సంఘటన నేపథ్యంలో… ఏపీలో రాష్ట్రపతి పాలన కూడా వేయాలని.. డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కూటమి వచ్చిన తర్వాత ఏపీ మొత్తం.. బీహార్ రాష్ట్రంల మారిపోయిందని… నిప్పులు చెరిగారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జాతీయస్థాయిలో తెలియజేయాలనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.