ఏపీ కంది రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. కంది రైతుకు ‘మద్దతు’కు మించి ధర వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నేరుగా రైతుల నుంచి సేకరిస్తోంది జగన్ ప్రభుత్వం. మార్కెట్ రేటు ప్రకారం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు అధికారులు. ఈ తరుణలోనే క్వింటా మద్దతు ధర రూ.7,000 ఉంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.9500 నుంచి రూ.10,000 వరకు చెల్లింపు చేస్తోంది జగన్ సర్కార్.
గ్రామాల్లోని ఆర్బీకేల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. 20 వేల టన్నులకుపైగా కందుల సేకరణకు సమాయత్తం అయింది జగన్ సర్కార్. వీటిని మిల్లింగ్ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థలోకి తీసుకురాబోతున్నారు. ప్రతినెలా వినియోగదారులకు కందిపప్పు సరఫరా చేయబోతున్నారు. గతంలో రేటు ఎంత ఉన్నా సబ్సిడీపై కిలో రూ.67కే అందించిన ప్రభుత్వం..ఇప్పుడు కూడా ఇవ్వనుంది.