ఆంధ్రప్రదేశ్ లో చిరు వ్యాపారులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 3.97 లక్షల మందికి జగనన్న తోడు పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ 10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈనెల 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించారు. ఈమేరకు లబ్ధిదారులను గుర్తించాలంటూ గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్,మొప్మాలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ పథకం ద్వారా రుణం పొంది సకాలంలో అసలు, మొత్తాన్ని చెల్లించిన వారితో పాటు కొత్త వారికి వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. 18 ఏళ్ళు వయస్సు నిండిన వారు ఈ పథకానికి అర్హులు. రాష్ట్రంలో చిరు వ్యాపారులను ఆదుకునే ఎందుకు 2020 నవంబర్ 25న ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.