అమ్మాయి కనపడితే ముద్దులు, కడుపులు చేస్తారు – సీఎం జగన్‌

-

అమ్మాయి కనపడితే ముద్దులు, కడుపులు చేస్తారని పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు, నారా లోకేష్‌ లకు సీఎం జగన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇలాంటి వాళ్లు.. వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు సీఎం జగన్‌. తిరుపతిలో సీఎం జగన్‌ పర్యటించి… వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం నిధుల విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… చంద్రబాబు..దత్తపుత్రుడు..ఆయన సొంత పుత్రుడు..ఆయన బావ మరిది క్యారక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసు అంటూ విరుచుకుపడ్డారు.

తప్పుడు మాటలకు నిర్మాత చంద్రబాబు.. నటన, డైలాగులు దత్తపుత్రుడివి. మహిళలను ఎక్కడికో పంపిస్తున్నారని నిస్సిగ్గుగా ఒకరంటున్నారని ఫైర్‌ అయ్యారు సీఎం జగన్‌. మంచి చేస్తున్న వ్యవస్థలను, మంచి చేసే మనుషులను ఎవరూ అవమానించరని తెలిపారు. వాలంటీర్లపై అన్యాయంగా బురద జల్లుతున్నారు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా..? అని ప్రశ్నించారు. మంచి చేస్తున్న వాలంటీర్ల గురించి ఇటీవల సంస్కారం కోల్పోయి కొందరు మాట్లాడుతున్నారన్నారు. ఎండ, వాన, వరదలను లెక్క చేయకుండా వాలంటీర్లు పని చేస్తున్నారని కొనియాడారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news