వైసీపీ నేత హత్య నేపథ్యంలో…వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండకు రానున్నారు. బుధవారం రాత్రి హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వినుకొండకు చేరుకుంటారు.
అటు పల్నాడు హత్యపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని ఆగ్రహించారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారన్నారు.